
Non Bailable Case Registered Against Actor Dileep By Kerala Police: మలయాళ సూపర్ స్టార్ దిలీప్ లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు తిరిగింది. సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్‌పై ఓ ముఠా లైంగిక వేధింపులు పాల్పడి, ఆ సన్నివేశాలను చిత్రీకరించిన కేసులో దిలీప్ అరెస్టయిన సంగతి తెలిసిందే. 2017 జూలైలో అరెస్టయిన దిలీప్ రెండు నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంకా కొనసాగుతోన్న ఈ కేసు విషయంలో దిలీప్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు.
కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సమచారం ప్రకారం దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై (దిలీప్ బంధువులు, కుటుంబ సభ్యులు) కొత్త కేసు నమోదైంది. దిలీప్, మిగిలిన ఐదుగురు విచారణ అధికారులను బెదిరించారట. ఈ విషయాలను దర్శకుడు బాలచంద‍్ర కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌లు బయటపడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను దిలీప్, ఆతని బృందం బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ల ద్వారా తెలుస్తోందట. ఈ లైంగిక దాడి చేసేందుకు ముఠా కోసం రూ. 1.5 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
బాలచంద‍్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడి ఫిర్యాదు ప్రకారం దిలీప్‌తోపాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నించారట.
ఇదీ చదవండి: మరో నెగెటివ్ రోల్‌లో సమంత !.. ప్రేమకు అడ్డుగా