‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

MS Rajus Seven Days Six Nights First Look Poster Released - Sakshi

'డర్టీహరి'తో డైరెక్టర్‌గా మారిన ఎమ్మెస్‌ రాజు  తెరకెక్కిస్తున్న మరో చిత్రం  '7 డేస్‌ 6 నైట్స్‌'. సుమంత్‌ అశ్విన్‌, ఎం. రజనీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ మూవీ తర్వాతి షెడ్యూల్‌ ఈ నెల 28 నుంచి ఉంటుందని  డైరెక్టర్‌ ఎమ్మెస్‌ రాజు తెలిపారు. ఇక రోహన్, కృతికా శెట్టి సైతం ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top