అప్పుడు నేను, ఇప్పుడు నా కొడుకు..: మోహన్‌బాబు | Mohan Babu Son Of India First Lyrical Song Release Date Locked | Sakshi
Sakshi News home page

పెదరాయుడు రిలీజైన రోజే ఈ పాట కూడా..: మోహన్‌బాబు

Jun 13 2021 6:44 PM | Updated on Jun 13 2021 9:53 PM

Mohan Babu Son Of India First Lyrical Song Release Date Locked - Sakshi

1995 జూన్‌ 15న పెదరాయుడు రిలీజైన 26 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జూన్‌ 15న సన్‌ ఆఫ్‌ ఇండియా చిత్రానికి సంబంధించిన లిరికల్‌ వీడియో రిలీజ్‌..

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సన్‌ ఆఫ్‌ ఇండియా. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ పతాకం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశాడు మోహన్‌బాబు. జూన్‌ 15వ తేదీన సన్‌ ఆఫ్‌ ఇండియా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. తన కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన పెదరాయుడు చిత్రం విడుదలైన రోజే ఈ సాంగ్‌ రిలీజ్‌ కాబోతుందన్నాడు. 

"1995 సంవత్సరం నాటికి తెలుగు సినీ పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు.. ఆ 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరీర్‌లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు. 1995 జూన్‌ 15న పెదరాయుడు రిలీజైన 26 సంవత్సరాల తర్వాత 2021 జూన్‌ 15న సన్‌ ఆఫ్‌ ఇండియా చిత్రానికి సంబంధించిన లిరికల్‌ వీడియో రిలీజ్‌ కావడం శుభసూచకం.. అప్పుడు పెదరాయుడు చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు సన్‌ ఆఫ్‌ ఇండియాకు నా కొడుకు విష్ణువర్ధన్‌బాబు కావడం సంతోషకరం. పెదరాయుడు రిలీజ్‌ అయిన శుభతరుణాన సన్‌ ఆఫ్‌ ఇండియా చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు రఘువీర గద్యం మ్యాస్ట్రో ఇళయరాజాగారి సంగీత సారధ్యంలో రాహుల్‌ నంబియార్‌ స్వరంతో లిరికల్‌ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాటను శ్రీరాముడికి అంకితమిస్తున్నాను" అని మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు.

చదవండి: Son Of India: చిరు పరిచయం, మోహన్‌బాబు డైలాగులతో రచ్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement