
ఆ దర్శకుడి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఈ కాంబినేషన్‌లో... ఇది ముచ్చటగా మూడో సినిమా అవుతుంది.
హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే... రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా ఉంది. కానీ ‘సర్కారువారి పాట’ తర్వాత అది సెట్స్‌కి వెళ్లదని తెలుస్తోంది. మరి... ఈ మధ్యలో మహేశ్‌బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తారంటే... ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు త్రివిక్రమ్.
ఇదివరకు హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఈ కాంబినేషన్‌లో... ఇది ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. ఈ సినిమా అధికారిక ప్రకటన మే 31న ఉంటుందనేది తాజా సమాచారం. ఆ రోజు మహేశ్ తండ్రి సూపర్‌కృష్ణ బర్త్ డే (మే 31). మరి. తండ్రి పుట్టినరోజుకు తనయుడి కొత్త సినిమా అప్‌డేట్ వస్తుందా?
వేచి చూడాల్సిందే.