Mahesh Babu twins in black with Namrata Shirodkar at Sania Mirza's farewell bash - Sakshi
Sakshi News home page

Mahesh Babu : సానియా మీర్జా ఫేర్‌వెల్‌లో సందడి చేసిన మహేశ్‌ దంపతులు

Mar 6 2023 10:49 AM | Updated on Mar 6 2023 11:07 AM

Mahesh Babu And Namrata Attends Sania Mirza Farewell Bash - Sakshi

భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్‌ నుంచి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ఫేర్‌వెల్ పార్టీకి హాజరయ్యారు.  ఇద్దరూ బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇక సానియాతో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ మహేశ్‌ బాబు ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సానియా మీర్జా కుటుంబంతో మహేశ్‌బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో వీళ్లు సందడి చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement