Krithi Shetty Clarifies On Her Upcoming Projects - Sakshi
Sakshi News home page

Krithi Shetty: పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన బేబమ్మ

May 19 2021 8:17 AM | Updated on May 19 2021 10:58 AM

Krithi Shetty Gives Clarity On her Next New Projects - Sakshi

కృతీ శెట్టి... 'ఉప్పెన'తో కుర్రకారు దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. నిజానికి సినిమా రిలీజ్‌​ అవడానికి ముందే ఆమె టాలీవుడ్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. సినిమా ప్రోమో, సాంగ్స్‌లో కృతీని చూసిన యువత ఆమె అందం, అభినయానికి మంత్రముగ్ధులయ్యారు. అటు దర్శకనిర్మాతలు కూడా ఆమె కాల్షీట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారంటే ఆమె క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా వుంటే ఆమె ప్రస్తుతం నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'తో పాటు సుధీర్‌ భాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కొత్త చిత్రంలోనూ కృతిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. అయితే ఈ మూడు చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా బేబమ్మ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోలు ధనుష్‌, నితిన్‌, సూర్య, బెల్లంకొండ గణేష్‌ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటిస్తుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇదంతా వట్టి పుకార్లేనని తేల్చిపారేసింది కృతీ.

"నా తర్వాతి ప్రాజెక్టుల గురించి చాలా రూమర్లు విన్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. అవి హీరోలు నాని, సుధీర్‌ బాబు, రామ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయడం మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఒకవేళ మరేదైనా ప్రాజెక్ట్‌ ఒప్పుకుంటే నేనే స్వయంగా తెలియజేస్తాను" అని కృతీ శెట్టి క్లారిటీ ఇచ్చింది.

చదవండి: శాండల్‌ వుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement