'ది గ్రే మాన్‌' సీక్వెల్‌కి రెడీ అవుతున్న హీరో ధనుష్‌ | Sakshi
Sakshi News home page

Dhanush : 'ది గ్రే మాన్‌' సీక్వెల్‌కి రెడీ అవుతున్న హీరో ధనుష్‌

Published Thu, Aug 11 2022 8:35 AM

Kollywood Star Dhanush Officially Announces Gray Man Sequel Watch Video - Sakshi

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ధనుష్‌. కోలీవుడ్‌లో స్టార్‌ కథానాయకుడిగా ఎదిగిన ఈయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. కోలీవుడ్‌ దాటి బాలీవుడ్, హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన ధనుష్‌ తాజాగా టాలీవుడ్‌ను టార్గెట్‌ చేశారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఈయన ఏ భాషలో నటించినా విజయాలను కైవసం చేసుకుంటున్నారు.

బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న ధనుష్‌ హాలీవుడ్‌లో ది జర్నీ ఆఫ్‌ ఫక్రి చిత్రంతో రంగ ప్రవేశం చేసి తాజాగా ది గ్రే మాన్‌ చిత్రంలో నటించారు. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రుస్సో బ్రదర్స్‌ తెరకెక్కింన ఈ చిత్రం గత నెల 22వ తేదీన నెట్‌ఫిక్స్‌ ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రం విజయోత్సవంతో ది గ్రే మాన్‌కు సీక్వెల్‌ రపొందించడానికి ఆ చిత్ర యూనిట్‌ రెడీ అయ్యింది.

souదీని గురించి నటుడు ధనుష్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ  ది గ్రేమ్యాన్‌కు మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సీక్వెల్‌ తయారవుతోంది.. మీరు రెడీనా? అంట పోస్ట్‌ చేశారు. ఆయన పోస్ట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈయన నటింన తిరుట్రంబలం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement