ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ | Kiara Advani has strongly dismissed rumours claiming she asked makers of Toxic | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ

May 6 2026 2:29 AM | Updated on May 6 2026 2:29 AM

Kiara Advani has strongly dismissed rumours claiming she asked makers of Toxic

‘‘టాక్సిక్‌’ సినిమాలో నా పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’’ అంటున్నారు హీరోయిన్‌ కియారా అద్వానీ. ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యశ్‌ హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ హీరోయిన్లుగా నటించారు.

కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథకి అవసరం మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్‌ సీన్స్‌ చిత్రీకరించారట గీతూ మోహన్‌దాస్‌. అయితే ఫైనల్‌ కట్‌ చూసిన తర్వాత ఆ సన్నివేశాలను తొలగించాలని కియారా కోరారనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు కియారా అద్వానీ.

‘‘టాక్సిక్‌’ మూవీలో నా పాత్రకు సంబంధించి వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదు. ఈ మూవీ స్క్రిప్ట్‌ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే విధంగా నాపై ఉన్న కొన్ని సీన్స్‌ తొలగించమని యూనిట్‌ని కోరాననే వార్తలు కూడా అవాస్తవం. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే’’ అని స్పష్టం చేశారు కియారా. ఇదిలా ఉంటే.. మార్చి 19న రిలీజ్‌ కావాల్సిన ‘టాక్సిక్‌’ జూన్‌ 4కి వాయిదా పడింది. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్‌ కావడం లేదంటూ యశ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement