Karan Johar Gets Hilariously Trolled For Wearing Newspaper-like Clothes - Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నిర్మాత డ్రెస్సింగ్‌పై పేలుతున్న జోకులు

Mar 4 2021 3:08 PM | Updated on Mar 4 2021 3:34 PM

Karan Johar Gets Hilariously Trolled For Wearing Newspaper Print Shirt - Sakshi

బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పుకుంటారు. ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవడమే కాక అప్పుడప్పుడు ట్రెండ్‌ను సెట్‌ చేస్తుంటాడీ హీరో. అయితే కొత్త లుక్స్‌తో, కొంగొత్త వెరైటీ డ్రెస్సులతో నిర్మాత కరణ్‌ జోహార్‌ అతడికి తరచూ కాంపిటీషన్‌ ఇస్తుంటాడు. తాజాగా ఈ ప్రొడ్యూసర్‌ ఓ వైవిధ్యమైన బట్టలు ధరించాడు. న్యూస్‌పేపర్‌ ప్రింట్‌ వేసి ఉన్న షర్ట్‌ను ధరించాడు.  దానికి జోడీగా బ్లాక్‌ ట్రాక్‌ ప్యాంట్స్‌ వేసుకున్నాడు.

అయితే సెలబ్రిటీలు ఏం చేసినా దాన్ని ఇట్టే పట్టేసుకునే నెటిజన్లు కరణ్‌ డ్రెస్సింగ్‌ గురించి జోకులు పేలుస్తున్నారు. అతడు నిజంగానే పేపర్‌ చుట్టుకున్నట్లే ఉందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చినిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరికొందరు అది నిజంగానే వార్తాపత్రికే అని భ్రమపడి ఎందుకీయన పేపర్‌ కప్పుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరణ్‌ ఈ డ్రెస్సులో మనీష్‌ మల్హోత్రా నివాసంలో పార్టీకి హాజరయ్యాడు. ఈ పార్టీలో బీటౌన్‌ సెలబ్రిటీలు కరీష్మా కపూర్‌, మలైకా అరోరా, అమృత అరోరా, మహీప్‌ కపూర్‌, సీమా ఖాన్‌, గౌరీ ఖాన్‌ తదితరులు హాజరయ్యారు.

చదవండి: అజయ్‌ దేవ్‌గణ్‌ కారును అటకాయించిన దుండగుడు

శ్యామ్‌ కె. నాయుడికి సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement