రాజమౌళికి వ్యతిరేకంగా దేన్నీ సహించను: కంగనా ఫైర్ | Kangana Ranaut defends SS Rajamouli against right wing | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: రాజమౌళిని ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం: కంగనా

Feb 18 2023 4:58 PM | Updated on Feb 18 2023 5:23 PM

Kangana Ranaut defends SS Rajamouli against right wing - Sakshi

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి మద్దతుగా వరుస ట్వీట్స్ చేసింది. ఆయనను లక్ష్యంగా చేసుకోవద్దని రైట్‌ వింగ్‌కు హితవు పలికింది. రాజమౌళిని టార్గెట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైట్ వింగ్‌కు కంగనా వార్నింగ్ ఇచ్చింది. వరుస ట్వీట్లతో రాజమౌళికి మద్దతుగా నిలిచింది. 

కంగనా ట్వీట్ చేస్తూ.. 'మీరు దీనిపై అతిగా స్పందించనవసరం లేదు. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. కళాకారులకు ప్రత్యేకించి రైట్ వింగ్ మద్దతు లభించదు. మేధావి, జాతీయవాది అయిన రాజమౌళి సార్‌కి వ్యతిరేకంగా దేన్నీ సహించను. రాజమౌళి సార్ ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన దేశం పట్ల అంకితభావం కలిగి ఉన్నారు. ఈ జాతి వ్యక్తిగా రాజమౌళి సమగ్రతను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం.' అంటూ ట్విటర్‌లో ప్రశ్నించింది. రాజమౌళిపై ది న్యూ యార్కర్‌లో వచ్చిన కథనంపై కంగనా తీవ్రంగా స్పందించింది. 

మరో ట్వీట్‌లో రాస్తూ.. 'ప్రపంచం అతనిపై వివాస్పదమైన ముద్ర ఎందుకు వేసింది? అతను చేసిన వివాదం ఏమిటి? మన నాగరికతను కీర్తించడానికే బాహుబలి అనే సినిమా తీసినందుకా? లేక మన జాతి గర్వించేలా ఆర్ఆర్ఆర్ సినిమాని తీశాడనా? ఆయన అంతర్జాతీయంగా రెడ్ కార్పెట్‌లకు మన ధోతీని ధరించాడా? అతను చేసిన వివాదం ఏమిటి? దయచేసి చెప్పండి.' అంటూ సూటిగా ప్రశ్నించింది. 

కాగా.. ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మతం, హిందూ గ్రంథాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు మహాభారతం, రామాయణం పట్ల ప్రేమ ఉందని తెలిపారు. అయితే నా నుంచి మతపరమైన అంశాలకు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement