రైతుల కోసమే ‘జైసేన’ : సునీల్‌ | Jai Sena Movie For Farmers Sunil Says | Sakshi
Sakshi News home page

మనందరికీ రైతు అవసరం ఉంది – సునీల్‌

Jan 23 2021 11:09 AM | Updated on Jan 23 2021 11:52 AM

Jai Sena Movie For Farmers Sunil Says - Sakshi

శ్రీకాంత్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్‌ గౌతమ్‌ హీరోలు గా రూపొందిన చిత్రం ‘జైసేన’. వి. సముద్ర దర్శకత్వంలో వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. సునీల్‌ మాట్లాడుతూ– ‘‘ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ పాత్రలో నటించాను. రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయం’’ అన్నారు. వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించాం. రైతుల గురించి తీసిన సినిమా కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రవీణ్, అభిరామ్, రైటర్‌ చందు, కో ప్రొడ్యూసర్స్‌ శిరీషా రెడ్డి, శ్రీనివాస్‌  రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement