It's Official: Vignesh Shivan About His Wedding With Nayanthara - Sakshi
Sakshi News home page

Nayanthara- Vignesh Shivan Wedding: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్​..

Jun 7 2022 1:38 PM | Updated on Jun 7 2022 3:33 PM

Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara - Sakshi

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​కు కలిసిన నయన్-విఘ్నేష్​ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  

Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara: సౌత్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​కు కలిసిన నయన్-విఘ్నేష్​ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  


తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్​. 'నా ప్రేయసి​ నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్​ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. 

చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్

కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్​ చేస్తాం. జూన్​ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.' అని తెలిపాడు విఘ్నేష్ శివన్​.

చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్‌..

Advertisement
 
Advertisement
Advertisement