Hollywood Actor Patton Oswalt Interesting Comments On SS Rajamouli After Watching RRR - Sakshi
Sakshi News home page

Actor Patton Oswalt On Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసి జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్‌ నటుడు

May 27 2022 4:28 PM | Updated on May 27 2022 5:25 PM

Hollywood Actor Patton Oswalt Intresting Comments On SS Rajamouli After Watching RRR - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అద్భుతంగా ఉంది. డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానం, కథను చూపించిన తీరు అత్యద్భుతం. ఇకపై మిమ్మల్ని(రాజమౌళి) సినిమాలు తీసేందుకు అనుమతించకూడదు’

Hollywood Writer Patton Oswalt Interesting Comments On SS Rajamouli: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.

చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్‌ ఏమన్నదంటే..

విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా చూసిన ఓ హాలీవుడ్‌ నటుడు, సినీ రచయిత జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూసిన పాటన్‌ ఓస్వాల్ట్‌ వరుస ట్వీట్‌ చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌, మూవీ టీంపై ప్రశంసలు కురిపించాడు.

చదవండి: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ విన్నర్‌ బిందు మాధవి!

ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సినిమా ఇది అన్నాడు. ‘మీ దగ్గర్లోని థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆడకపోతే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ ట్యాగ్‌ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్‌ చేస్తూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అద్భుతంగా ఉంది. డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానం, కథను చూపించిన తీరు అత్యద్భుతం. ఇకపై మిమ్మల్ని(రాజమౌళి) సినిమాలు తీసేందుకు అనుమతించకూడదు. మీ తదుపరి చిత్రం కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నా’అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement