Jr Ntr, Ram Charan Nominated Critics Choice Super Awards 2023 - Sakshi
Sakshi News home page

క్రిటిక్స్‌ ఛాయిస్‌ సూపర్‌ అవార్డ్స్‌.. తారక్‌, చరణ్‌.. ఇద్దరూ నామినేట్‌

Feb 24 2023 7:22 PM | Updated on Feb 24 2023 8:54 PM

Critics Choice Super Awards 2023: Jr NTR, Ram Charan Nominated - Sakshi

ట్రిపుల్ ఆర్ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ నామినేషన్ అందుకున్నారు. మార్చి 16న విజేతలను ప్రకటిస్తారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్‌కు చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరి నటన లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాతలను సైతం ఆకట్టుకుంది. తాజాగా బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో చరణ్‌, తారక్‌ ఇద్దరూ నామినేట్‌ అయ్యారు. ది క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ రెండేళ్లుగా 'ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్' పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ఇస్తోంది. మూడో ఎడిషన్‌లో ట్రిపుల్ ఆర్ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ నామినేషన్ అందుకున్నారు. మార్చి 16న విజేతలను ప్రకటిస్తారు.

హైదరాబాద్‌లో చెప్పులు లేకుండా, అమెరికాలో షూలతో..
ఇకపోతే స్వామిమాల వేసుకున్న రామ్‌చరణ్‌ ఇక్కడ చెప్పులు లేకుండా తిరిగారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చెప్పులు లేకుండా నడిచిన అతడు అమెరికాలో మాత్రం షూలు వేసుకుని కనిపించాడు. దీనిపై కొందరు విమర్శలు చేశారు. నిజానికి స్వామి మాలతోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్... అక్కడ ఆలయంలో మాల తీశారు. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన చరణ్‌ను చూడటం కోసం అభిమానులు బారులు తీరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

చదవండి: పెళ్లిలో కన్యాదానం చేయనన్న తల్లి, ఏడ్చేసిన హన్సిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement