Cricketer Yuvaraj Singh's Birthday Wishes To Nandamuri Balakrishna - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna Birthday: బాలకృష్ణ బర్త్‌ డే.. యువరాజ్ సింగ్ స్పెషల్ విషెస్!

Jun 10 2023 4:34 PM | Updated on Jun 10 2023 4:51 PM

Cricketer Yuvaraj Singh Birthday Wishes To Nandamuri Balakrishna - Sakshi

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ముందువరుసలో ఉంటారు. ఇవాళ ఆయన 63వ జన్మదినం జరుపుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రముఖులు బాలయ్యకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా బాలయ్యకు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్త్‌ డే విషెష్ తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకుంటూ యువరాజ్ ట్వీట్‌ చేశారు. 

(ఇది చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?)

యువరాజ్ సింగ్ ట్వీట్‌లో రాస్తూ..' నందమూరి బాలకృష్ణ సార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ డెడికేషన్ సోసైటీపై ఎంతో ప్రభావం చూపుతుంది. అనేక ఇతర కార్యక్రమాలతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజ సేవలో మీరు చూపే అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక ముందు మరిన్నీ పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. యూవీ చేసిన ట్వీట్‌పై అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement