ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చిరు, మహేశ్‌ బర్త్‌డే విషెస్‌ | Chiranjeevi Birthday Wishes To AP CM YS Jagan Mohan Reddy On Twitter | Sakshi
Sakshi News home page

Chiranjeevi And Mahesh Babu: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చిరు, మహేశ్‌ బర్త్‌డే విషెస్‌

Dec 21 2021 12:33 PM | Updated on Dec 21 2021 3:34 PM

Chiranjeevi Birthday Wishes To AP CM YS Jagan Mohan Reddy On Twitter - Sakshi

( ఫైల్‌ ఫోటో )

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు (డిసెంబర్‌ 21) సీఎం జగన్‌ బర్త్‌డే సందర్బంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు ‘హ్యాపీ బర్త్‌డే శ్రీవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు’ అంటూ ట్వీటర్‌ వేదికగా సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మరింత అభివృద్ధి చెందాలి. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరపుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement