Chandrayaan 3 Launch: Mahesh Babu Wishes to ISRO Scientists - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఇస్రో ప్రయోగం విజయవంతం.. మీరు దేశానికి గర్వకారణమన్న మహేశ్‌ బాబు

Jul 14 2023 3:47 PM | Updated on Jul 14 2023 5:11 PM

Chandrayaan 3 Launch: Mahesh Babu Wishes to ISRO Scientists - Sakshi

మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు.

జాబిలిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న భారత్‌ కల సాకారమైంది. బాహుబలి రాకెట్‌ ఎల్‌ వీఎం3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌ 3 రాకెట్‌ విజయవంతంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్‌ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.

ఈ రాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.

చంద్రుడిపై 126 ప్రయోగాలు
అమెరికా 12 ప్రయోగాలు చేసిన తర్వాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. కానీ భారత్‌ 2008లో చంద్రుడిపైకి చంద్రయాన్‌–1 పేరుతో ఆర్బిటర్‌ ప్రయోగించి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది.  ఈ ప్రయోగంలో చంద్రుడికి రెండోవైపున నీటి జాడలున్నాయని కనుగొన్నారు.  2019లో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో ల్యాండర్‌, రోవర్‌ ఆఖరి నిమిషంలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్‌ ఆగిపోయాయి.

కానీ ఆర్బిటర్‌ మాత్రం ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు చంద్రయాన్‌ 3 ప్రయోగంలో మరిన్ని పరిశోధనలు చేపట్టి విలువైన సమాచారాన్ని సేకరించనున్నారు. తాజా ప్రయోగంతో కలుపుకుని ఇప్పటికి దాకా ప్రపంచవ్యాప్తంగా 126 ప్రయోగాలు చంద్రుడిపైనే చేయడం విశేషం!

చదవండి: ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. ఉపాసన షేర్‌ చేసిన వీడియో చూశారా?
ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లకుండా తప్పు చేశా: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement