పుస్తకంగా రానున్న శ్రీదేవి జీవిత చరిత్ర | Boney Kapoor Announce Sridevi Biography as The Life of a Legend | Sakshi
Sakshi News home page

Sridevi: ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌ పేరిట శ్రీదేవి బయోగ్రఫీ..

Feb 9 2023 8:44 AM | Updated on Feb 9 2023 8:44 AM

Boney Kapoor Announce Sridevi Biography as The Life of a Legend - Sakshi

శ్రీదేవి బయోగ్రఫీని చిత్రంగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులు ఆశపడుతున్నారు. కాగా ది లైఫ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ పుస్తకం విడుదల అనంతరం శ్రీదేవి బయోపిక్‌ తెరకెక్కే అవకాశం ఉంటుందేమో చూడాలి.

దివంగత నటి శ్రీదేవిని ఎవరూ అంత తొందరగా మరచిపోరు. భారతీయ సినీ చరిత్రలో చెరగని ఒక పేజీ ఆమె పేరు. అందం, అభినయం కలిస్తే శ్రీదేవి. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత కథానాయకిగా మారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్‌స్టార్‌గా రాణించారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300లకు పైగా చిత్రాలు చేశారు. ప్రముఖ నటులందరితోనూ నటించారు. ఈమె నటనకు గానూ పద్మశ్రీ నుంచి పలు జాతీయ, రాష్ట్రీయ, ఫిలింఫేర్‌ అవార్డులు వరించాయి. అలాంటి శ్రీదేవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది.

శ్రీదేవి కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన  ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్‌ కుమార్‌ ఆమె బయోగ్రఫిని ‘‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’’ పేరుతో పుస్తకంగా రచించారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్‌ బుధవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. దీన్ని ఈ ఏడాది చివరిలో వెస్ట్‌ల్యాండ్‌ బుక్‌ సంస్థ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా శ్రీదేవి బయోగ్రఫీని చిత్రంగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులు ఆశపడుతున్నారు. కాగా ది లైఫ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌ పుస్తకం విడుదల అనంతరం శ్రీదేవి బయోపిక్‌ తెరకెక్కే అవకాశం ఉంటుందేమో చూడాలి.

చదవండి: పాన్‌ ఇండియా స్టార్‌ అంటే అన్ని భాషలు మాట్లాడాలి: శివ రాజ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement