శాకుంతలం:  కీలకపాత్రలో బాలీవుడ్‌ నటుడు

Bollywood Actor Kabir Bedi To Play Key Role In Shakuntalam Movie - Sakshi

దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శకుంతలగా సమంత, దుష్యంతుడి పాత్రను దేవ్‌ మోహన్‌ పోషిస్తున్నారు. ఓ కీలక పాత్రను బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడీ పోషించనున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు చిత్రనిర్మాతల్లో ఒకరైన గుణశేఖర్‌ కుమార్తె నీలిమా గుణ.

ఈ సినిమా అంగీకరించిన సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ బుక్‌ ‘స్టోరీస్‌ ఐ మస్ట్‌ టెల్‌’ని నీలిమకు బహమతిగా ఇచ్చి, ‘‘డియర్‌ నీలిమ. ఈ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు «థ్యాంక్స్‌. నిన్ను నా సోదరిలా భావిస్తున్నాను. నీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కబీర్‌ బేడి. ‘‘థ్యాంక్యూ  సార్‌. మీతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు నీలిమ. ఈ చిత్రానికి ‘దిల్‌’ రాజు ఓ నిర్మాత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top