
బిగ్‌బాస్ హస్‌లో సండే అంటే ఫన్‌డే. ప్రతి ఆదివారం హౌస్‌లో ఆటలు,పాటలు ఉంటాయి. మధ్యలో ఎలిమినేషన్ కూడా ఉంటుంది. బిగ్‌బాస్ 6 నుంచి మొదటగా ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఈ రోజే తెలుస్తుంది. శనివారం అంతా కంటెస్టెంట్స్ క్లాస్ పీకిన నాగార్జున..ఆదివారం మాత్రం చాలా సరదాగా వారితో ఆటలు ఆడించారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని వదిలారు మేకర్స్. సండే అంటే ఫన్‌డే అంటూ హుషారుగా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున.
(చదవండి: ఇదెక్కడి తిక్కల్ది..మెచ్యూర్డ్‌గా ప్రవర్తించు.. గీతూ,రేవంత్‌లకు నాగ్ క్లాస్)
కంటెస్టెంట్స్‌తో వెరైటీ గేమ్ ఆడించారు. ‘ఎవరికి ఎంత తెలుసు’ అనే ఆటలో భాగంగా హౌజ్‌మేట్స్‌ను కొన్ని ప్రశ్నలు ఆడిగాడు. ‘శ్రీహాన్ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు’.? ‘ఆర్‌జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు.?’ లాంటి ఫన్నీ ప్రశ్నలతో అంతే ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు ఇంటి సభ్యులు. ఇక హౌస్‌లో ఉన్న ఆడపిల్లల్లో బుట్టబొమ్మ ఎవరు అని బాలాదిత్యను అడగ్గా.. తెలివిగా మెరీనా పేరు చెప్పాడు. ఇలా ఫన్ని గేమ్‌తో సండే ఎపిసోడ్ అంతా సరదాగా గడిచినట్లు తెలుస్తుంది. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment