
Atrangi Re Movie Trailer Out And Releasing On December: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, తమిళ స్టార్ ధనుష్‌లు కలిసి నటించిన హిందీ చిత్రం ఆత్రంగి రే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇవాళ (నవంబర్ 24) విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా ఆనంద్ ఎల్ రాయ్ సినిమాగా అనుభూతి కలుగుతుంది. ఇందులో సారా అలీ ఖాన్, ధనుష్ ఒకరికొకరు బలవంతంగా పెళ్లి చేసుకునే పాత్రలో అలరించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అక్కీ తనకంటే పెద్దవయసు పాత్రలో కనిపించనున్నారు. అలాగే ట్రైలర్‌లో అక్షయ్ ఎంట్రీ విజిల్స్ వేసేలా ఉంది.
'ఆత్రంగి రే' చిత్రంలో సారా అలీ ఖాన్ ప్రేమలో రెండు భిన్నమైన అభిరుచులను కలిగి ఉన్న పాత్ర చేసింది. ధనుష్, సారాల యాస, నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను సారా అలీ ఖాన్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆత్రంగి రే ట్రైలర్ వచ్చేసింది. 'ఈ అద్భుత క్షణాలను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. మీ అందరికీ నా రింకు పాత‍్రను పరిచయం చేస్తున‍్నాను' అని రాసుకొచ్చింది. నవంబర్ 23న అక్షయ్, సారా, ధనుష్ పాత్రల ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'ఆత్రంగి రే' విడుదల కానుంది.