సీతగా అనుష్కా శర్మ?

Anushka Sharma to play Sita opposite Prabhas in Adipurush  - Sakshi

‘ఆది పురుష్‌’ అనే ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్‌ నటించనున్న విషయం తెలిసిందే. ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్ర చేయనున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రభాస్‌ సరసన సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది చర్చనీయాంశం అయింది. సీత పాత్రలో కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు ఆ మధ్య వినిపించాయి. తాజాగా అనుష్కా శర్మను ఈ పాత్రకు సంప్రదించారని సమాచారం.

ఆల్రెడీ కథాచర్చలు పూర్తయ్యాయట. అయితే ప్రస్తుతం అనుష్కా శర్మ ప్రెగ్నెంట్‌. జనవరిలో డెలివరీ అని ఇటీవలే ప్రకటించారు. జనవరి నుంచే ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభిస్తారని ఓ వార్త. ఒకవేళ అనుష్కా శర్మ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. డెలివరీ అయిన వెంటనే షూటింగ్‌లో పాల్గొంటారా?  లేక ఆలస్యంగా చిత్రీకరణలో పాల్గొంటారో చూడాలి. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపిస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top