Project K Update: Prabhas And Amitabh Bachchan Praises Each Other Over Shooting - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan-Prabhas: ఎట్టకేలకు నా కల నెరవేరింది: ప్రభాస్‌

Feb 19 2022 4:25 PM | Updated on Feb 19 2022 5:15 PM

Amitabh Bachchan, Prabhas Praises Each Other After First Shot In Project K - Sakshi

 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, దీపికా పదుకొనే హీరోహీరోయిన్‌గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌ కే. భారీ బడ్జెట్‌తో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా సెకండ్‌ షెడ్యుల్‌ను ప్రారంభమైంది.  కాగా ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ షెడ్యూల్‌లో ప్రభాస్‌-దీపికాలకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక తాజాగా మొదలైన సెకండ్‌ షెడ్యుల్‌ను అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బీ ట్వీట్‌ చేస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ‘‘ఫస్ట్‌డే.. ఫస్ట్‌ షాట్‌.. ఫస్ట్ టైం ‘బాహుబలి’ ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా అనిపించింది. అతని ప్రతిభ, అంతకుమించిన వినయం. అతని నుంచి చాలా నేర్చుకోచ్చు’’ అంటూ అమితాబ్‌ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

అలాగే ప్రభాస్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్‌బీ ఫొటో షేర్‌ చేస్తూ.. ‘ఎట్టకేలకు నా చిరకాల కల నెరవేరింది. లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్‌ షాట్‌లో యాక్ట్ చెయ్యడం జరిగింది’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ అభిమానం చాటుకోవడం చూసి వారి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. దీంతో వారి పోస్ట్‌లను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement