
సామ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. చై హజ్బెండ్ మెటీరియల్. ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు చై వెంటనే
చైసామ్.. పేర్లు కలిసిపోయినట్లే ఆ జంట కూడా అన్యోన్యంగా ఉండేది. నాలుగేళ్లు స్టార్ సెలబ్రిటీ కపుల్‌గా వెలుగొందిందీ జంట. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ జంటను చూసి ఎవరికి కన్ను కుట్టిందో ఏమో కానీ అర్ధాంతరంగా విడాకుల న్యూస్ అభిమానుల చెవిలో వేసి షాకిచ్చారు చైసామ్. గతేడా అక్టోబర్‌లో భార్యాభర్తలుగా విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సమంత, చైతన్య. అప్పటి నుంచి సామ్ ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో నిలస్తోంది. తాజాగా సమంత చైతూను మెచ్చుకుందని, ఇది వాళ్లిద్దరూ కలవడానికి సంకేతమంటూ వార్తలు వెలువడుతున్నాయి.
సమంత చైతూని పొగడడం వాస్తవమే, కానీ అది పాత వీడియో. వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతున్న సమయంలో సామ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 'చై హజ్బెండ్ మెటీరియల్. ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు చై వెంటనే తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడుకోమన్నాడు. చైతూ నిజంగా పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్' అని పొగడ్తలు కురిపించింది. గతంలోని ఈ ఇంటర్వ్యూ తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. ఒకరినొకరు ఇంతలా అర్థం చేసుకునే వీరిద్దరికీ విడిపోయేంత కష్టం ఏమొచ్చింది? అని మరోసారి చర్చిస్తున్నారు నెటిజన్లు.