Senior Actress Rama Prabha About Her Financial Status - Sakshi
Sakshi News home page

Rama Prabha: అతి దారుణంగా నటి ఆర్థిక పరిస్థితి అంటూ వార్తలు.. స్పందించిన రమాప్రభ

Feb 3 2023 5:08 PM | Updated on Feb 3 2023 7:12 PM

Actress Rama Prabha About Her Financial Status - Sakshi

పూరీ, నాగార్జున.. ఇలా కొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నన్ను ఇంటి మనిషిగా ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకవుతుంది? వాళ్లు

దాదాపు పద్నాలుగు వందాలకు పైగా సినిమాల్లో నటించింది సీనియర్‌ నటి రమాప్రభ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాకుండా లేడీ కమెడియన్‌గానూ అలరించింది. వయోభారంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఆర్థిక కష్టాలతో అడుక్కు తినే పరిస్థితికి వచ్చిందంటూ కొందరు వార్తలు రాసేశారు. తాజాగా దీనిపై రమాప్రభ స్పందించింది.

'యూట్యూబ్‌లో నేను అడుక్కు తిన్నానని రాస్తున్నారు. నా సొంత యూట్యూబ్‌ ఛానల్‌ రమాప్రభ ప్రయాణంలో నా ఇంటిని కూడా చూపించాను. నేను అడుక్కు తింటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నేను బిజీగా పని చేస్తున్నా.. అలాంటిది ఏ గ్యాప్‌లో అడుక్కున్నాను? పూరీ, నాగార్జున.. ఇలా కొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వాళ్లు నన్ను ఇంటి మనిషిగా ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకవుతుంది? వాళ్లు నాకు భిక్ష వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. అందరికంటే నేను రిచ్‌గా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది రమాప్రభ.

చదవండి: అలాగైతే కె.విశ్వనాథ్‌ సగం హైదరాబాద్‌ కొనేసేవారు
అర్ధరాత్రి లేచి మా గురించి ఆరా తీసేవారు: విశ్వనాథ్‌ పర్సనల్‌ బాయ్‌

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement