కరోనా బారిన పడ్డ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ | Aamir Khan Tested Positive For Corona | Sakshi
Sakshi News home page

కరోనా బారిన పడ్డ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌

Mar 24 2021 1:27 PM | Updated on Mar 24 2021 3:38 PM

Aamir Khan Tested Positive For Corona - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటీనటులకు కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే  రణ్‌బీర్ కపూర్, మనోజ్ బాజ్‌పేయి వంటి ప్రముఖ తారల తరువాత, ఈ వైరస్ అమీర్ ఖాన్‌కు కూడా సోకింది. బుధవారం జరిగిన కోవిడ్‌-19 పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని తేలింది. ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌ ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అతని మేనేజర్‌ తెలిపారు.

కాగా, అమీర్‌ ప్రస్తుతం టామ్‌ హ్యాక్స్‌ నటించిన ఫారెస్ట్‌ గంప్‌ సినిమా రీమేక్‌ బీజీలో ఉన్నాడు. ఇటివలే అమీర్ ఖాన్ తన 56వ పుట్టినరోజును మార్చి 14 న జరుపుకున్నాడు. మరుసటి రోజు, తాను సోషల్ మీడియాను వదిలివేస్తున్నట్లు అమీర్ ప్రకటించాడు. అతడు ఇటీవల 'కోయి జానే నా' చిత్రం నుంచి 'హర్ ఫన్ మౌలా' పాటలో కనిపించగా, ఈ పాటలో అతడు అలీ అవ్రమ్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. అంతేకాకుండా అమీర్ ఖాన్ రాబోయే చిత్రం 'లాల్ సింగ్ చాడ్డా'తో ప్రేక్షకులను అలరించనున్నాడు.ఈ చిత్రం డిసెంబర్ 24, 2021 న విడుదల కానుంది.  గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కరోనాతో సినిమా విడుదల వాయిదా పడింది.

(చదవండి: సోషల్‌ మీడియా ఖాతాల డియాక్టివేట్‌పై అమిర్‌ క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement