మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ | - | Sakshi
Sakshi News home page

మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఎమ్మెల్యే సునీతారెడ్డి

వెల్దుర్తి(తూప్రాన్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. బుధవారం మాసాయిపేట మండలం రామంతాపూర్‌ తండాలో గ్రామ పంచాయతీ నూతనం భవనం, ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో కేవలం గ్రామసభలకు మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంచాయతీ భవనానికి భూమి దానం చేసిన ఉప సర్పంచ్‌ రాజుని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, ఏఈ పవన్‌, సర్పంచ్‌ చందర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement