రేపు ఉద్యోగుల సమస్యలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

రేపు ఉద్యోగుల సమస్యలపై నిరసన

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

మాట్లాడుతున్న జగదీష్‌

సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయనున్నట్లు టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్‌ తెలిపారు. జిల్లా టీఎన్జీవోస్‌ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న రాష్ట్ర టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు, జనరల్‌ సెక్రెటరీ ముజీబ్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్‌, కోశాధికారి ఉమాదేవికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌ మాట్లాడుతూ.. పీఆర్‌సీ, సీపీఎస్‌, డీఏ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశా రు. ఈ నెల 17న టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, వెంకట్‌ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌, రాష్ట్ర హెచ్‌డబ్ల్యూఓ సంఘం అధ్యక్షుడు భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు బలరాం, జిల్లా ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు నాయకులకు అభినందనలు తెలిపారు.

టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌

Advertisement
 
Advertisement
Advertisement