పిల్లల చదువు బాధ్యత పెద్దలదే | - | Sakshi
Sakshi News home page

పిల్లల చదువు బాధ్యత పెద్దలదే

Jun 29 2025 7:23 AM | Updated on Jun 29 2025 7:23 AM

పిల్లల చదువు బాధ్యత పెద్దలదే

పిల్లల చదువు బాధ్యత పెద్దలదే

సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా

మెదక్‌జోన్‌: బడీడు పిల్లలను చదివించే బాధ్యత పెద్దలదేనని సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనాఫాతిమా అన్నారు. శనివారం పట్టణంలోని న్యూ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పిల్లలకు చదువుకునే హక్కు ఉందని, అది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై విద్యార్థులకు వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని చట్టం చెబుతోందన్నారు. పిల్లలకు శారీరక, మానసిక, ఆర్థిక బాధలు రాకుండా చూడాలని, చైల్డ్‌ లేబర్‌ వంటి సమస్యలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయని అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టడానికి, బాధితులకు న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా పోక్సో చట్టం కట్టుదిట్టంగా అమలులో ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement