నస్పూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి గని కార్మికుడు మాడుగుల రమేశ్(34) మృతిచెందాడు. ఈ ఘటన శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ ఆర్‌కే 7 గనిలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం గనిలో విధులు ముగించుకుని మోటార్‌సైకిల్‌పై క్యాతనపల్లిలోని తన ఇంటికి బయల్దేరాడు. శ్రీరాంపూర్ కొత్తరోడ్‌లోని సులభ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారి–363పై మోటార్‌సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు ఆర్‌కే 8 డిస్పెన్సరీకి తరలించగా వైదులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


