బెల్లంపల్లి: బెల్లంపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 7,8,9 తేదీల్లో మహబూబా బాద్‌లో రాష్ట్రరస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో వి ష్ణు, స్నేహ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు త రపున ఆడి ప్రతిభ కనబర్చారు. వారి ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి 17వ తేది వరకు జాతీయస్థాయి పోటీలు జరగనున్నా యి. పాఠశాల హెచ్‌ఎం, ఎంఈవో పోచయ్య, ఇన్‌చార్జి శిరీష, పీడీ బండి రవి, ఉపాధ్యాయులు సదరు విద్యార్థులను అభినందించారు.


