మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
కై లాస్‌నగర్(బేల): అక్రమంగా మద్యం తరలి స్తున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు బే ల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. బేల మండల కేంద్రంలో కుడ్మేత జంగు, పెందుర్ దేవి దాస్ మద్యం బాటిళ్లను తరలిస్తుండగా ఎన్ని కల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సివిల్ అధికారి సిడం వామన్‌కు పట్టుబడడంతో పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు. దాదాపు 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.10,450 ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందువల్ల ఎవరైనా మద్యం, డబ్బులు తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


