నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి
చెన్నూర్‌రూరల్/చెన్నూర్: పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. మండలంలోని కిష్టంపేట గ్రామపంచా యతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడువు లోపే నామినేషన్లు స్వీకరించాలని, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీవో మోహన్, చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్‌రావు, ఎంపీవో అజ్మత్ అలీ పాల్గొన్నారు.
చెన్నూర్‌లో పట్టణంలో..
చెన్నూర్‌లోని ఆరోగ్యకేంద్రం, అమృత్ 2.0, సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వంద పడకల ఆస్పత్రి భ వన నిర్మాణ, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పా ఠశాల గదుల మరమ్మతు పనులు, అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.


