● జంగ్‌ సిపాయి భూములపై విచారణకు పట్టు ● కోర్టులో కేసు వేసేందుకు బాధితుల యత్నం ● బయటపడనున్న అందుగులపేట సోలార్‌ పవర్‌ ప్లాంటు భూ బాగోతం | Sakshi
Sakshi News home page

● జంగ్‌ సిపాయి భూములపై విచారణకు పట్టు ● కోర్టులో కేసు వేసేందుకు బాధితుల యత్నం ● బయటపడనున్న అందుగులపేట సోలార్‌ పవర్‌ ప్లాంటు భూ బాగోతం

Published Thu, May 23 2024 12:10 AM

● జంగ్‌ సిపాయి భూములపై విచారణకు పట్టు ● కోర్టులో కేసు వ

రికార్డులకెక్కని వివరాలు

సౌర విద్యుత్‌ కంపెనీకి సంబంధించిన భూమి వివరాలు ఇప్పటికీ పూర్థి స్థాయిలో రికార్డులకు ఎక్కలేదు. వ్యవసాయేతర(నాలా) భూములుగా నమోదు చేయాల్సి ఉన్నా, ఇంకా ధరణిలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి. పట్టాదారుల వివరాలు అసంపూర్తిగా ఉండడంతోపాటు పాస్‌బుక్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు పోర్టల్‌లో చూపిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండడంతో భూములు కారు చౌకగా కాజేసిన ఆ దొరతోపాటు కొనుగోలు చేసిన సోలార్‌ కంపెనీ యాజమాన్యం మధ్య జరిగిన లావాదేవీలు తేలితే భూముల వ్యవహారం పూర్తిగా బయటపడనుంది. జంగ్‌ సిపాయి కాకుండానే ఆ గ్రామవాసుల అసైన్డ్‌ భూములు, పట్టదారులు సైతం కొందరు సోలార్‌ కంపెనీపై పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నారు. తమ గ్రామ శివారులో ఉన్న భూమిని తెలివిగా బదలాయింపు జరిగిన తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై గ్రామస్తులు కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సైతం ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మందమర్రి మండలం అందుగులపేట శివారులోని జంగ్‌సిపాయి భూములపై బాధితులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తగిన ఆధారాలు, రెవెన్యూ రికార్డులతో హైకోర్టులో కేసు వేసి న్యాయం కోసం కొట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మందమర్రి మండలం అందుగులపేట శివారు జంగ్‌సిపాయి భూముల్లో ఓ కార్పొరేట్‌ కంపెనీ సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేసింది. అయితే.. బ్రిటిష్‌ ఇండియా సమయంలో నిజాం సర్కారు అప్పటి సైనికులకు ఈ భూములు కేటాయించింది. అప్పటి నుంచి భూములు ప్లాంటుకు అమ్మేసే వరకు ఆ భూముల్లో నిజ వారసులు ఎవరూ మోఖా మీద లేరు. ఈ భూములపై కన్నేసిన ఓ దొర కీలకంగా వ్యవహరించి తన పరం చేసుకుని తర్వాత సోలార్‌ కంపెనీ నిర్వాహకులకు అమ్మేశారు. భూ అక్రమాలపై ‘సాక్షి’ గత మార్చిలోనే కథనాలు ప్రచురించడంతో ఇంటెలిజెన్స్‌, రెవెన్యూ వర్గాలు విచారణ చేపట్టాయి. ఇప్పటికే ఈ భూ వ్యవహారంలో నివేదికలు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో కోర్టు వైపు నుంచి కూడా పోరాడితే తమకు న్యాయం జరుగుతుందనే కోణంలో భూ బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సౌర విద్యుత్‌ ప్లాంటు నిర్మించిన భూముల వ్యవహారం మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అసలు వారసులెవరు?

అందుగులపేట శివారులోని జంగ్‌సిపాయి భూములు 60ఎకరాలు వాస్తవ వారసులకు తెలియకుండానే అన్యాక్రాంతం అయ్యాయి. తెరపైకి వచ్చిన వారసుల్లో నిజ వారసులు ఎవరనేది తేలాల్సి ఉంది. 103 సర్వేనంబర్లలో ఐదుగురు సిపాయిలకు 60 ఎకరాల చొప్పున ఇచ్చిన 300ఎకరాలు ఉండేవి. ఈ భూములను కబ్జాలో ఉన్న వారి నుంచి అగ్గువకు కొట్టేసి, అవే భూములను సోలార్‌ కంపెనీకి అమ్మి భారీగా సొమ్ము చేసుకున్నారు. వీరిలో కొంత భూ మిని వాస్తవ వారసులతో కొనుగోలు చేయగా, ఇదే భూమిని మరొకరు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో వి వాదం మొదలైంది. గ్రామస్తులకు సైతం ఈ భూ ములపై స్పష్టత లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇక కొందరు భూ అక్రమదారులకు మద్ద తు తెలపడంతో పట్టించుకునేవారే కరువయ్యారు. అసలు వారసులెవరనేది తెలియకుండా క్రయ విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నెలకొల్పిన కార్పొరేట్‌ కంపెనీ ఈ భూమి వివరాలు పూర్తిగా తెలిసీ కొనుగోలు చేసిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ భూములపై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలైతే ప్రస్తుతం సోలార్‌ కంపెనీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement