మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కళా సిల్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన రంగురంగుల వస్త్రాలు ఒకేచోట ఉండటంతో కొన్ని రోజులుగా కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత అల్లికలతో తయారు చేసిన సిల్క్, కాటన్ వస్త్రాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడ, మూగా, కోసా, ఎరి, బాగల్పూర్ సిల్క్, టస్సర్ ఉన్నాయి. అలాగే హర్యానా బెడ్, కుషన్ కవర్లు, డోర్ కర్టెన్లు, హ్యాండీక్రాఫ్ట్‌స్ తదితర ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. కాగా, చేనేత వస్త్రాలు, హస్తకళలను అందరూ ప్రోత్సహించాలని ఎగ్జిబిషన్ మేనేజర్ బిజు మండల్ ఒక ప్రకటనలో కోరారు.


