చారకొండ: గోకారం రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని శుక్రవారం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు హైదరాబాద్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు నుంచి మినహాయించాలని 200 రోజులుగా రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పొ ల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ వైస్‌ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వా సితులు ప్రకాశ్, పర్వతాలు, పెద్దయ్య, శ్రీరా మ్, సంజీవ, రవి, బిక్కు పాల్గొన్నారు.


