నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి

Jun 19 2026 12:48 AM | Updated on Jun 19 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి పెట్టి భవిష్యత్‌ తరాలకు మార్గనిర్ధేశం చేయాలని ఓయూ ప్రొఫెసర్‌ పద్మావతి సూచించారు. పీయూలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాజెక్టులకు సంబంధించిన వైవోస్‌ గురువారం పూర్తయ్యాయి. ఈ మేరకు పీయూలో విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించగా.. ఓయూ ప్రొఫెసర్‌ పద్మావతి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజం అవసరం మేరకు ప్రాజెక్టులు, పరిశోధనలు చేయడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన, శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకునే విధంగా ఎదగాలని సూచించారు. పలువురు విద్యార్థులు ప్రాజెక్టులకు సంబంధించి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రవీణ, హెచ్‌ఓడీ నూర్జహాన్‌, కోఆర్డినేటర్‌ రామ్మోహన్‌, సిద్ధమారగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement