కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, చారగొండ తదితర మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. ఏడుగురిని బైండోవర్ చేశారు. కల్వకుర్తి మండలం తర్నికల్, పర్నికల్ తండా, రాచూర్ తండా, చారగొండలో దాడులు చేశారు. తర్నికల్‌లో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. ఏడుగురి మహిళలను కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్ర హీం ఎదుట బైండోవర్ చేశారు. రాచూర్ తండాలో నిర్వహించిన దాడు ల్లో 180 కేజీల నల్లబెల్లం 20 కేజీల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. చారకొండలో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్‌ఐ వెంకటరెడ్డి చెప్పారు. ఈ దాడుల్లో డీటీఎఫ్ టీం ఎస్‌ఐ అరుణ, కల్వకుర్తి ఎస్‌ఐ శ్రావణి, ట్రైనీ ఎస్‌ఐ చంద్రకిరణ్, సిబ్బంది జనార్దన్‌రెడ్డి, మునీందర్, తేజశ్రీ పాల్గొన్నారు.
● సారా అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్, ఏడుగురి బైండోవర్


