
9 ఏళ్ల వయసులో హాఫిజే ఖురాన్
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం షాసాబ్‌గుట్టలోగల మదర్సా దారుల్ ఉలుమ్ అరబియా లిల్‌బనాత్ ఫౌండర్, డైరెక్టర్ హాఫిజ్ ఖాజా ఫైజొద్దీన్ కుమార్తె మ్ముల్‌ఖైర్ మాహిరా 9 ఏళ్లకు హిఫ్‌జే ఖురాన్‌ను పూర్తి చేశారు. మూడున్నరేళ్లలో ఆమె పట్టుదలతో కష్టపడి హాఫిజా ఖురాన్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం బాలికను హైదరాబాద్‌లోని జామియా నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ముఫ్తి ఖలీల్ అహ్మద్ ఘనంగా సన్మానం చేశారు. పవిత్ర రబీలవల్ మిలాద్ ఉన్ నబీ మాసంలో హిఫ్‌జే ఖురాన్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది బాలికలు పట్టుదలతో చదివి హిఫ్‌జే ఖురాన్ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ ఖాజా మొయినుద్దీన్, సాజిదా బేగం, మదర్సా ప్రిన్సిపాల్ హాఫిజా హుస్నా ఫాతిమా, ఖాజా రియాజుద్దీన్, ఖాజా మొయిజుద్దీన్, ఖాజా సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన
జామియా నిజామియా చాన్సలర్