
అపోహలకు గురి కావద్దు
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సమస్యను జఠిలం చేసుకోవద్దు. పరస్పర అవగాహనతో మసులుకోవాలి. ఒకరికి తెలియకుండా మరొకరు గోప్యత పాటిస్తే సహజంగానే ఇంకొకరికి అనుమానం కలుగుతుంది. వివాహ బంధం భార్యాభర్తలిద్దరై సమానమే. ఏ ఒక్కరూ తాము పైచేయి సాధించాలని చూసినా ఆ కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుంటాయి. దాన్ని ఆదిలోనే తుంచేయాలి. పిల్లల ఎదుట దంపతులు గొడవపడడం ద్వారా వారిలో అభద్రతాభావం పెరుగుతుంది. కుటుంబంపై ప్రేమ మమకారం కోల్పోతే చెడు ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులు అన్నీ విషయాలను అందరితో చర్చించాలి.
– వంగీపురం శ్రీనాథాచారి, ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు