
ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది
● విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలి: కలెక్టర్ విజయేందిర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని, తల్లి, తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవం అన్నారు. అందుకే ఉపాధ్యాయులందరూ ఆ స్థానానికి ఉనన విలువను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో రాణించేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలని సూచించారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా పాఠశాలలకు సౌకర్యాలు కల్పిందని, వీటిని ఉపయోగించుకొని ఫలవంతమైన బోధన చేయాలని కోరారు. ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.