రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం | - | Sakshi
Sakshi News home page

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

Jun 14 2025 10:02 AM | Updated on Jun 14 2025 10:02 AM

రక్తం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

● సాధారణంగా మూడు రకాల బ్లడ్‌ గ్రూప్‌లను అధికంగా వినియోగించడం జరుగుతుంది. ఏ, బీ, ఓ పాజిటివ్‌ గ్రూప్‌లను రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా రక్తదాతలు ఇస్తారు. ఏ–బీ నెగిటివ్‌ గ్రూప్‌ చాలా అరుదుగా లభ్యం అవుతాయి. జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న బ్లడ్‌బ్యాంకు నుంచి ఉమ్మడి జిల్లాతో పాటు కొడంగల్‌, తాండూర్‌, వికరాబాద్‌ల నుంచి రెఫర్‌ కేసులు వస్తాయి. రక్తం ఎక్కువగా గైనిక్‌, రోడ్డు ప్రమాదం కేసులకు, తలసేమియా, ఏర్నియా (రక్తహీనత) కేసులకు అవసరం పడుతుంది.

అరుదైన గ్రూపులు..

రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్‌, నెగెటివ్‌ గ్రూపులు ఉంటాయి. వీటిలో పాజిటివ్‌ గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్‌ గ్రూపులు చాలా అరుదుగా ఉంటాయి. ఏబీ నెగెటివ్‌ వేల మందిలో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం తీసుకునే ముందు హెచ్‌బీ శాతం, హెచ్‌ఐవీ పరీక్షలు రిపోర్టు, కాస్‌ మాచింగ్‌ రిపోర్టు ఉందో లేదో సరిచూసుకోవాలి.

2003లో

మొదటిసారిగా..

నేను లయన్స్‌ క్లబ్‌ సభ్యుడిగా ఉన్న క్రమంలో 2023లో మొదటిసారి రక్తం ఇచ్చాను. 18ఏళ్ల కాలంలో 57సార్లు రక్తదానం చేశాను. బీ–నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ వందలో పది మందికి మాత్రమే ఉంటుంది. చాలా అరుదుగా లభ్యం అవుతుంది. గుండెకు సంబంధించిన బైపాస్‌ సర్జరీలు చేస్తున్న క్రమంలో అత్యవసరం ఉన్న ఐదు నుంచి ఆరుగురికి ఆస్పత్రికి వెళ్లి రక్తం ఇచ్చాను. ఓసారి ప్రసవం కోసం వచ్చిన మహిళకు అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే.. వెళ్లి ఇవ్వగా ఆమె ప్రాణాలు నిలిచాయి. అదే విధంగా 15సార్లు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహించాను.

– కెంగూరి శ్రీకాంత్‌ యాదవ్‌, దేవరకద్ర

అత్యవసర సమయంలో..

నేను ఐటీఐ చదువుతున్న సమయంలో కల్వకుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు కాగా.. బీ–నెగిటివ్‌ రక్తం అత్యవసరం ఉందని స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లి ఇచ్చాను. ఇప్పటి వరకు 7సార్లు రక్తదానం చేశాను. అత్యవసరం ఉందని ఫోన్‌ చేస్తే తప్పక వెళ్లి ఇస్తాను. – శేఖర్‌ యాదవ్‌, నవాబుపేట

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీతో పాటు ఐదు ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు, పాలమూరు పట్టణంలో మూడు ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు పనిచేస్తున్నాయి. రోజు 100 నుంచి 150 మందికి రక్తం అవసరం పడుతుంది. ప్రధానంగా ఇటీవల రోడ్డు ప్రమాద కేసులు గణనీయంగా పెరిగాయి. వీరితో పాటు ప్రసవం కేసులు, రక్తహీనత కేసులకు సైతం రక్తదాతల నుంచి తీసిన రక్తం అవసరం పడుతుంది. జనరల్‌ ఆస్పత్రి, రెడ్‌క్రాస్‌లో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గుముఖం పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనరల్‌ ఆస్పత్రిలో 500 యానిట్ల వరకు రక్తాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. కానీ ప్రతినెలా 250 నుంచి 350 యూనిట్లు అవసరం ఉండటంతో అదే స్థాయిలో రక్తాన్ని సేకరిస్తున్నారు. అయితే బ్లడ్‌ బ్యాంక్‌ల్లో ఒక్కోసారి రక్త నిల్వలు లేకుండా పోతుండటంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తాన్ని సేకరించాల్సి వస్తుంది. అదీ కూడా అవసరమున్న వ్యక్తులు దాతలను తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడాలి..

రక్తదానంతో ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడిన వాళ్లం అవుతాం. ఏ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కల్గిన నేను ఇప్పటి వరకు 48సార్లు రక్తదానం చేయడంతో పాటు ఎంతో మందిని ప్రోత్సహించి రక్తదానం చేయించాను. ఒకసారి ప్లాస్మాదానం కూడా చేశాను. లయన్స్‌ క్లబ్‌తో కలిసి ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలపై అవగహన కల్పించాను.

– రంగినేని మన్మోహన్‌, హెడ్‌కానిస్టేబుల్‌

రాష్ట్రంలో ప్రథమ స్థానంలో..

రాష్ట్రంలోనే 157సార్లు రక్తదానం చేయడంతో పాటు 8 సార్లు ప్లాస్మా, 8సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేయడం జరిగింది. నేను 1983 నుంచి రక్తదానం చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఓసారి రక్తదానం చేస్తున్నాను. రెడ్‌క్రాస్‌ నుంచి ఈ ఏడాది 162 క్యాంపులు నిర్వహించి 6,289 రక్త యూనిట్లు సేకరించాం. ప్రస్తుతం రెడ్‌క్రాస్‌లో ఎస్‌డీపీ మిషన్‌ అందుబాటులోకి తెచ్చాం. ప్లేట్‌లెట్స్‌ తగ్గిన వారికి రెడ్‌క్రాస్‌లో ఎక్కించడానికి కావాల్సిన శిక్షణ కూడా సిబ్బందికి ఇప్పించాం. – లయన్‌ నటరాజ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌

39సార్లు రక్తదానం..

జిల్లా జనరల్‌ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో చాలా అత్యవసరం ఉన్న రోగులకు రక్తదానం చేశాను. ఇప్పటి వరకు 39సార్లు రక్తదానం చేయడం జరిగింది. బ్లడ్‌బ్యాంకులో పని చేయడం వల్ల రక్తం విలువ తెలుసుకొని నా వంతు బాధ్యతగా రక్తదానం ఇవ్వడం మొదలుపెట్టాను.

– కోటేశ్వర్‌రెడ్డి, బ్లడ్‌బ్యాంక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌,

జిల్లా జనరల్‌ ఆస్పత్రి

● దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత కలిగిన వారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు ఆ విషయాల్ని వైద్యులకు చెబితే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయరాదనే విషయం చెబుతారు.

మూడేళ్ల కాలంలో జనరల్‌ ఆస్పత్రిలో రక్త సేకరణ ఇలా..

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 1
1/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 2
2/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 3
3/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 4
4/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 5
5/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 6
6/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం 7
7/7

రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement