
జిల్లాలకు కొత్త బాస్‌లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు కొత్త కలెక్టర్లు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం జోగుళాంబ గద్వాల మినహా మిగిలిన నాలుగు జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బి.విజేంద్రను ప్రభుత్వం నియమించింది. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న బదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్ జిల్లాకు రానున్నారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయనను నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా నియమించగా, ప్రస్తుత కలెక్టర్ ఉదయ్‌కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ (2014 బ్యాచ్) నారాయణపేట కలెక్టర్‌గా రానున్నారు. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వనపర్తి కలెక్టర్‌గా 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆదర్శ్ సురభి నియమితులయ్యారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఇక్కడ కలెక్టర్‌గా ఉన్న తేజస్ నంద్‌లాల్ పవార్‌ను సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా పనిచేస్తున్న కుమార్ దీపక్‌కు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. ఆయనను మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
● ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉన్న ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాకు కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కుదరగా, వచ్చే నెల 7న వివాహం చేసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన త్వరలో కలెక్టర్ హోదాలో ఇంటివాడు కానున్నారు. కాగా.. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న తేజస్ నంద్‌లాల్ పవార్ గతేడాది కలెక్టర్ హోదాలోనే వివాహం చేసుకోవడం విశేషం.
ఉమ్మడి పాలమూరులో గద్వాల మినహా నాలుగు జిల్లాల కలెక్టర్లు బదిలీ
మహబూబ్‌నగర్, నారాయణపేటకుమహిళా పాలనాధికారులు
పదోన్నతిపై నాగర్‌కర్నూల్
అదనపు కలెక్టర్ పదోన్నతి

జిల్లాలకు కొత్త బాస్‌లు

జిల్లాలకు కొత్త బాస్‌లు

జిల్లాలకు కొత్త బాస్‌లు