ఆన్‌లైన్‌ టికెట్లతో మోసపోయిన న్యాయవాదులు | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ టికెట్లతో మోసపోయిన న్యాయవాదులు

Published Wed, May 22 2024 5:25 AM

ఆన్‌లైన్‌ టికెట్లతో మోసపోయిన న్యాయవాదులు

అలంపూర్‌: ఉత్తరఖండ్‌లోని చార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన న్యాయవాదులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోగా మోసపోయినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని శాంతినగర్‌కు చెందిన గవ్వల శ్రీనివాసులు, అలంపూర్‌కు చెందిన నాగరాజు యాదవ్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన ఏగేశ్వర రాజు, శివకుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన గిరివర్ధన్‌రెడ్డి ఈ నెల 15న చార్‌దామ్‌ యాత్ర నిమిత్తం పాట్నాకు వెళ్లారు. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ హెలీక్యాప్టర్‌లో వెళ్లడానికి అక్కడ ఉన్న పవన్‌ హ్యాండ్స్‌ అనే సంస్థలో ఆన్‌లైన్‌లో ఒక్కొక్కరికి రూ.5,500 చెల్లించి టికెట్లు బుక్‌ చేసుకున్నారు. గంగోత్రి దర్శనం చేసుకున్న అనంతరం పుట్టకాశీ నుంచి పాట్నాలోని ఏవియేషన్‌ సర్వీసెస్‌ వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లు చూపించగా.. తమ సంస్థకు చెందినవి కావని, ఫేక్‌ టికెట్లు అని చెప్పారు. అయితే వీరితోపాటు తెలంగాణ, ఏపీలోని తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది వరకు ఇలాగే ఆన్‌లైన్‌లో కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లడానికి టికెట్లు బుక్‌ చేసుకొని మోసపోయారని న్యాయవాది గవ్వల శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడ సెప్టెంబర్‌ వరకు దర్శనానికి అవకాశం లేదని చెబుతున్నారని.. కానీ సదరు వెబ్‌సైట్‌లో ఇప్పటికీ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉందని వాపోయారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇలాంటి మోసాలపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉమ్మడి జిల్లా నుంచి చార్‌దామ్‌ బయల్దేరిన 11 మంది

పాట్నా నుంచి కేదార్‌నాథ్‌కు రూ.5,500తో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌

హెలీప్యాడ్‌ చేరుకున్న తర్వాత ఫేక్‌ టికెట్లు అని చెప్పిన సంస్థ

Advertisement
 
Advertisement
 
Advertisement