
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర 24 గంటలూ మూడు అంచెల భద్రత నిఘా పెట్టాలని, సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ సిబ్బందికి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లను శుక్రవారం ఎస్పీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించి భద్రతను తనిఖీ చేశారు. యూనివర్సిటీ సమీప పరిధిలో అనుమతి లేని వ్యక్తులు ఎవరూ రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరాల పనితీరు సక్రమంగా ఉండే విధంగా సదరు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.