
ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం..
కురవి: మండలంలోని బలపాల గ్రామానికి చెందిన ఈడిగిరాల బాలవర్ధన్‌కు 17ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె లక్ష్మీప్రసన్న మరిపెడ ఎంజేపీలో 7వ తరగతి, కుమారుడు భానుప్రకాశ్ మానుకోట ఎంజేపీలో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బాలవర్ధన్‌కు వచ్చే జీతంతో కుటుంబం ఇబ్బంది లేకుండా నడుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రతీ వస్తువుకు విపరీతమైన ధరలు పెరుగుతున్నాయని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే కష్టమని బాలవర్ధన్ అన్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నామన్నారు.