
ముమ్మాటికీ చంద్రబాబు రైతు వ్యతిరేకి
పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు
ప్రభుత్వ కుట్రలను ఛేదించుకొని నిరసనలు
పెద్ద ఎత్తున కదిలివచ్చిన రైతులు
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నేతలు
దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక
కిక్కిరిసిన ఆర్డీఓ కార్యాలయాలు
చంద్రబాబు మూమ్మాటికీ రైతు వ్యతిరేకి. అప్పట్లోనే ఆయన వ్యవసాయం దండగా అన్న విషయాన్ని మర్చిపోలేం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతాంగానికి బాసటగా నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని సులభతరం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. కోడుమూరు మండలం, పోలకల్ రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గం. మోసపూరిత హామాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే నేతలు ప్రజల్లో తిరగలేకపోతున్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమే.
– బి.వై.రామయ్య, కర్నూలు నగర మేయర్
రైతుల పక్షపాతిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి బాసటగా నిలిస్తే, చంద్ర బాబు రైతు వ్యతిరేకిగా మరోసారి నిరూపించుకున్నాడు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ నిద్రమత్తులోనే ఉంది. విజనరీ ముఖ్యమంత్రికి రైతుల అవసరాలు కూడా తెలియకపోవడం శోచనీయం. ప్రభుత్వం దిగివచ్చే వరకు వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. – ఆదిమూలపు సతీష్, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’