
బిహార్ సర్పంచ్‌ల బృందం పర్యటన
కర్నూలు(రూరల్): పసుపల గ్రామంలో శుక్రవారం బిహార్ సర్పంచ్‌ల బృందం పర్యటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాదాపు 55 మంది బిహార్ సర్పంచ్‌లు పసుపల గ్రామానికి చేరుకుని అభివృద్ధి పనులను, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామం నుంచి సేకరించే తడి, పొడిచెత్త నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువు యూనిట్‌ను పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్‌ఐఆర్‌డీ అధికారి శశిరేఖ, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, ఎంపీడీఓ రఘునాథ్, గ్రామ సర్పంచ్ బొగ్గుల శీలమ్మ, పసుపల పంచాయతీ సెక్రటరీ హేమంత్ రెడ్డి ఉన్నారు.