పాణ్యం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ తాము చేసిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేకపోతున్నారు. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే పంథా కొనసాగించారు. దీంతో ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమం నిర్వహించిన ఊరి పేరు పూడిచెర్ల అనబోయి ఉప్పలపాడుగా సంభోదించారు. సభకు పొదుపు సంఘాల మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. అయితే పవన్ ప్రసంగిస్తుండగానే మహిళలు ఇంటిబాట పట్టడం కనిపించింది. ఇకపోతే కర్నూలు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు పది మంది ఉండగా.. కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనడం గమనార్హం.
ఆకట్టుకోని పవన్ ప్రసంగం