మోక్ష మార్గానికి శుభ రాత్రులు | - | Sakshi
Sakshi News home page

మోక్ష మార్గానికి శుభ రాత్రులు

Mar 22 2025 1:22 AM | Updated on Mar 22 2025 1:17 AM

రహదారులపై నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ కనిపించవు. తీవ్ర ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పిడిన ఎండమావులని తేలుతోంది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు దాటి పోయాయి. కర్నూలు నగరం సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఎండమావులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు మధ్యాహ్నం వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను కాసేపు ఆపుకుని వెళ్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

నంద్యాల(వ్యవసాయం): పవిత్ర రంజాన్‌ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ముస్లింలు ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్‌ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే... రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో చివరి పదిరోజులు ఏకాగ్రతతో అల్లాను ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయని, మోక్షానికి మార్గం లభిస్తుందని భావించి ముస్లింలు మసీదులు, ఇళ్లల్లో ఎతెకాఫ్‌, తాఖ్‌రాత్‌ చేపట్టనున్నారు.

పుణ్య ఫలాల శుభరాత్రులు..

రంజాన్‌ మాసం చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్‌ వస్తుంది. దీన్నే షబ్‌ ఏ ఖదర్‌ లేదా లైలతుల్‌ ఖద్ర్‌ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో (ఈనెల 24, 25, 27, 29వ తేదీ) ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్‌రాత్‌గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఈనెల 27వ రోజు రాత్రే లైలతుల్‌ ఖద్ర్‌ ఉంటుందని ముస్లింల విశ్వాసం. లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్‌ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్‌ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్‌ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్‌ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రుల నుంచి తెల్లవారుజామున ఫజర్‌ నమాజ్‌ వరకు పవిత్ర రంజాన్‌ విశిష్టత, మహాప్రవక్త గుణగణాలు, ఖురాన్‌ పఠనం, జికార్‌, తహజూద్‌, నమాజ్‌లతో గడుపుతారు. ఇందుకోసం ఆయా మసీదులకు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, గురువులు, వక్తలను పిలిపించి దైవసందేశాలను భక్తులకు వివరిస్తారు. ఇందుకుగాను పట్టణంలోని పలు మసీదు కమిటీ నిర్వాహకులు ఈ పదిరోజుల పాటు వక్తలను ఆహ్వానిస్తారు.. ఈ సమయాల్లో మసీదులకు హాజరయ్యే భక్తులకు తెల్లవారుజామున సహేరి ఏర్పాట్లు చేస్తారు.

అల్లాహ్‌ ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్‌..

రంజాన్‌లో బడీరాత్‌ ఎంత ప్రాధాన్యత ఉంటుంతో ఎతెకాఫ్‌కు కూడా అంతే ఉంటుంది. అల్లాహ్‌ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఈ ఎతెకాఫ్‌ కల్పిస్తుందంటారు. ‘రంజాన్‌ కే మహినేమె..జిస్‌ గావ్‌మే ఏక్‌బీ ఆద్మీ ఎతెకాఫ్‌ నా రహేత.. ఉస్‌ గావ్‌ పర్‌ లానత్‌ హై. ఔర్‌ మేరి రహ్మత్‌ నహీ రహేగి’. అంటే రంజాన్‌ మాసంలో ఒక ఊర్లో ఒక వ్యక్తి కూడా ‘ఎతెకాఫ్‌’ ఉండకపోతే.. ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. ఎతెకాఫ్‌ను చివరి పది రోజుల్లో పాటించాలి. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కన పెట్టి వీలు పడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో గడపడమే ఎతెకాఫ్‌ అంటారు. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్‌ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇంటికెళ్లి మనం సమస్య చెప్పుకుంటాం. ఆయన అభయం ఇస్తే ధైర్యం వస్తుంది. మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి అభయానికే ఊరట కలిగితే.. సృష్టికర్త అల్లాహ్‌కు మొరపెట్టుకుంటే లభించే ఆనుగ్రహానికి హద్దు ఉండదంటారు.

పది రోజులు పవిత్రమైన రోజులు

రంజాన్‌ మాసంలో చివరి పదిరోజులు మోక్ష మార్గానికి తరావి, ఎతెకాఫ్‌, తాఖ్‌ రాత్‌లు ఎంతో పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో కఠోర దీక్షలు రాత్రింబవళ్లు ఖురాన్‌, దైవ బోధనలతో నియనిష్టతో ఉంటే ఎన్నో మాసాల నుంచి చేయనటువంటి పుణ్యం, మోక్షాలు లభిస్తాయన్నారు.

– అబ్దుల్‌ఖాదీర్‌, మౌల్వి, ఆర్టీసీ బస్టాండ్‌ మసీదు, నంద్యాల

రంజాన్‌ మాసం ఆఖరి పది రోజులు ప్రత్యేకం

ఎతెకాఫ్‌, తాఖ్‌రాత్‌ల నిర్వహణలో ముస్లింలు

మోక్ష మార్గానికి శుభ రాత్రులు 1
1/1

మోక్ష మార్గానికి శుభ రాత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement